అనుష్క టైటిల్ రోల్ లో

  • IndiaGlitz, [Friday,October 23 2015]

రుద్రమదేవి', బాహుబలి' చిత్రాలతో అల్రెడి టాప్ హీరోయిన్ గా ఉన్న అనుష్క రేంజ్ మరింత పెరిగింది. అనుష్క బాహుబలి పార్ట్2 నటించడానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా పిల్లా జమీందార్' ఫేమ్ అశోక్.జి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో భాగ్ మతి' అనే సినిమా ప్రారంభమవుతుందనే వార్తలు వినిపించినా ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుతం బాహుబలి' పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా స్టార్ట్ కావడానికి సమయం పట్టేటట్లే ఉంది. ఈ గ్యాప్ లో అనుష్క అశోక్ దర్శకత్వంలో భాగ్ మతి' సినిమా చేస్తుందని ఈ సినిమా డిసెంబర్ లో స్టార్ కావచ్చునని సమాచారం. మరి ఈ సినిమ నేపథ్యమెంటో తెలియాల్సి ఉంది.