ప్రభాస్‌తో పెళ్లి పిక్‌పై క్లారిటీ ఇచ్చిన అనుష్క..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, అనుష్కల రిలేషన్షిప్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని వారిద్దరూ చెప్పినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. చివరకు అనుష్క అభిమానులు కూడా ఆమె వారితో ట్విట్టర్లో చిట్ చాట్ ద్వారా ఇవే ప్రశ్నలు అడిగారు. ఆదివారం అనుష్క అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేసింది. గతంలో అనుష్క, ప్రభాస్‌ల పెళ్లికి సంబంధించిన క్యాండిడ్ పిక్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. అనుష్క అభిమానులతో చిట్‌చాట్‌లో భాగంగా ఒకరు అనుష్కను దీనిపై ప్రశ్నించారు.
ఆ క్యాండిట్ పిక్‌పై స్వీటీ క్లారిటీ ఇచ్చింది. ఆ పిక్ మూవీ షూటింగ్లో భాగంగా తీసినది కాదని.. ఒక మూవీ పోస్టర్ కోసం తీసిన పిక్ అని అనుష్క తెలిపింది. ఆ పిక్ తనకు చాలా ఇష్టమైన మూవీకి సంబంధించినదని అనుష్క వెల్లడించింది. ‘‘మిర్చి సినిమా కోసం అందమైన పోస్టర్ రూపొందించడంలో భాగంగా మేమిద్దరం షాట్ గురించి చర్చించుకుంటున్నప్పుడు ఆ పిక్ తీశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి మూవీ.. అది నాకు చాలా ఇష్టమైన మూవీ’’ అని అభిమానుల సందేహాన్ని అనుష్క తీర్చింది.
ప్రస్తుతం అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఓటీటీ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ఒక ఛాలెంజింగ్ రోల్లో నటించింది. మాధవన్‌తో కలిసి చాలా కాలం తర్వాత తిరిగి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని అనుష్క తెలిపింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్న అనుష్క.. తన తదుపరి చిత్రం ఎలాంటిది ఎంచుకుంటుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments