మరోసారి ప్రభాస్ గురించి చెప్పిన అనుష్క ఏమందో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, వారు పెళ్లి చేసుకుంటారని పలు సందర్భాల్లో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో అనుబంధం గురించి అనుష్కను అడిగితే ఆమె ఏమాత్రం విషయాన్ని దాచుకోకుండా చెప్పేసింది. ‘‘నేను, ప్రభాస్ ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తులం. ఇద్దరం ‘బిల్’లా, ‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాల్లో కలిసి నటించాం. ఇద్దరికీ పెళ్లి కాలేదు. కాబట్టి ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చేస్తున్నాయి. నిజానికి నాకు ప్రభాస్ 3ఎ.ఎం. ఫ్రెండ్. అంటే ఏ సమయంలోనైనా నేను తనతో మాట్లాడేంత అనుబంధం ఉంది. ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఎప్పుడో చెప్పేసేవాళ్లం. ఇద్దరం ఎమోషన్స్‌ని దాచుకోలేం’’ అన్నారు.
ఇదే సందర్భంలో దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు, దర్శకుడు.. ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అనుష్క స్పందిస్తూ ‘‘బబ్లూ నాకు మంచి స్నేహితుడు. అతనితో పెళ్లి అని ఎలా రాసేస్తారు? అంతకు ముందు వేరే హీరోలు, క్రికెటర్లతో పెళ్లి అని రాసేశారు. నేను పెళ్లి చేసుకుంటే కచ్చితంగా అందరికీ చెబుతా’’ అన్నారు అనుష్క. ఈమె నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. మరి కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout