అనుష్క 'సైలెంట్'
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, భాగమతి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న అనుష్క శెట్టి .. తదుపరి చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో `సైలెంట్` అనే చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో అనుష్క సరసన మాధవన్ నటించనున్నారు. తెలుగు 50 చిత్రాలకు రచయితగా పనిచేసిన కోన వెంకట్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
వస్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. సైలెంట్ హారర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్నిపీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ చిత్రంలో అంతర్జాతీయ స్థాయి నటీనటులు కూడా నటించబోతున్నారు. రైటర్‌గా, నిర్మాతగా రాణించిన కోన వెంకట్ తొలిసారి `సైలెంట్`తో దర్శకుడిగా మారబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments