అనుష్క ‘నిశ్శబ్దం’ ఓటీటీ రిలీజ్ ఖరారైనట్లేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తెలుగు చిత్ర సీమలో అనుష్క ఓ సమాధానంగా కనపడటమే కాదు.. అవకాశాలను అందిపుచ్చుకుని సదరు పాత్రలకు న్యాయం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఈమె నటించిన ‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి’ చిత్రాలు మంచి ఆదరణను పొందాయి. అలాగే బాహుబలిలో అనుష్క పోషించిన దేవసేన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో కొందరు నిర్మాతలు ఓ మోస్తరు సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మరికొందరు వారి సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారు.
కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్‌లకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, క్రేజ్ ఉన్న సినిమాలను ప్రముఖ డిజిటల్ సంస్థలు దక్కించుకున్నాయని టాక్. తాజాగా ఈ లిస్టులో నిశ్శబ్దం సినిమా కూడా చేరిందట. ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిశ్శబ్దం సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటుందట. దాదాపు రూ.25 కోట్లకు ఈ డీల్ కుదిరిందని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అమెజాన్ ఓ నిర్ణయం తీసుకోనుందట. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రాన్ని కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com