విరుష్క కూతురికి ఆసక్తికర పేరు.. అర్ధం ఏంటంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనుష్క శర్మ దంపతులకు ఇటీవల పండంటి బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. దీంతో వారి వైవాహిక జీవితంలో మరింత ఆనందం తోడైంది. అయితే పాప జన్మించిన విషయం మినహా ఇప్పటివరకు తమ చిన్నారి గురించి విరాట్, అనుష్కల జంట ఎలాంటి వార్తనూ బయటకు రానివ్వలేదు. తాజాగా వీరు తమ పాపకు నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి తమ చిన్నారి ఫొటోను, పేరును అనుష్క ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
కోహ్లీ, అనుష్క దంపతులు తమ ముద్దుల కూతురికి `వమిక` అని నామకరణం చేశారు. అనుష్క చిన్నారిని ఎత్తుకుని ఉండగా.. విరాట్ తమ కూతురుని ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను అనుష్క అభిమానులతో పంచుకుంది. ‘మేమిద్దరం ప్రేమాభిమానాలతో ఇప్పటి వరకూ కలిసి జీవించాం. కానీ, మా చిన్నారి వమిక మా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. కన్నీళ్లు, సంతోషం, బాధ, ఆనందం.. అన్ని భావోద్వేగాలను కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో అనుభవిస్తుంటాం. కనురెప్పలు పడలేదు. కానీ, మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. మీ అందరి ప్రార్థనలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’’ అని అనుష్క తెలిపింది.
వమిక అనేది మనం ఇప్పటి వరకూ వినని పేరు. చాలా ఆసక్తికరంగా ఉంది. విరాట్లోని తొలి అక్షరం, అనుష్కలోని చివరి అక్షరం కలిసి వచ్చేలా పేరు పెట్టారు. అయితే అర్ధం పర్ధం లేకుండా ఈ జంట తమ ముద్దుల కూతురికి ఆ పేరు పెట్టలేదని తెలుస్తోంది. వమిక అంటే అర్థం దుర్గాదేవి. తమ పేర్లు కలిసి వచ్చేలా మాత్రమే కాకుండా.. కూతురిని అమ్మవారి అవతారంగా కూడా భావిస్తూ ఈ పేరు పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com