అనుష్క కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి2లో చేసిన దేవసేన పాత్రతో నటిగా మరింత గుర్తింపుని తెచ్చుకుంది అనుష్క. ఆ సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా.. ఆమె నుంచి మరో సినిమా రాలేదు. ఆమె తాజా చిత్రం భాగమతి.. చిత్రీకరణ పూర్తిచేసుకున్నా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతోంది. అన్నీ కుదిరితే ఈ సినిమాని డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది ఆ చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్.
ఇదిలా ఉంటే.. భాగమతి తరువాత అనుష్క చేయబోయే చిత్రం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరింది. అదేమిటంటే.. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అనుష్క ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోందట. అనుష్క ఇదివరకు చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనుందని.. గౌతమ్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కించనున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. ఇదివరకు ఎంతవాడుగానీ చిత్రం కోసం గౌతమ్, అనుష్క కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments