'నిశ్శబ్దం' కోసం ఆ రెండు విషయాలను నేర్చుకున్న అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ జేజెమ్మ అనుష్క శెట్టి దాదాపు రెండేళ్ల తర్వాత `నిశ్శబ్దం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై టీజీవిశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను చేయడానికి ముందు అనుష్క మూడు విషయాల్లో అనుష్క సమయం తీసుకుంటుందట. ఒకటి బరువు తగ్గడం కోసం ఆమె డిటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంది.
అలాగే నిశ్శబ్దం చిత్రంలో అనుష్క పాత్ర మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. పాత్రలో ఒదిగిపోవడం కోసం అనుష్క మాటలు రాకుండా చేతల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేసే సంజ్ఞల విద్యను మూడు నెలల పాటు శిక్షణ తీసుకుని నేర్చుకుంట అనుష్క. అలాగే అనుష్క పాత్ర కథ ప్రకారం డ్రాయింగ్ ఆర్టిస్ట్. అనుష్క వేసిన పెయింటింగ్స్ కోసం ఏదో మేనేజ్ చేసేద్దామని దర్శక నిర్మాతలు చెప్పిన వినకుండా పెయింటింగ్ నేర్చుకుందట. అంతా ఓకే అనుకున్న తర్వాత సెట్స్‌లోకి వచ్చిందని నిర్మాత కోన వెంకట్ తెలిపారు.
భాగమతి తర్వాత అనుష్క నటిస్తోన్న `నిశ్శబ్దం` చిత్రంలో మాధవన్, మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments