సూపర్..అనుష్క!
Send us your feedback to audioarticles@vaarta.com
జులై 21, 2005.. ఈ తేది అందాల నటి అనుష్క కెరీర్లో మరిచిపోలేనిది. ఎందుకంటే.. సరిగ్గా ఇదే రోజున ఆమె నటించిన తొలి చిత్రం 'సూపర్' విడుదలైంది. సినిమా ఫలితం మాటెలా ఉన్నా.. ప్రస్తుతం అనుష్క స్థానం టాలీవుడ్లో నెం.1. కెరీర్ మొదలైన ఐదేళ్లలోపు 'అరుంధతి' రూపంలో స్టార్డమ్ని సొంతం చేసుకున్నఅనుష్క.. మరో ఐదేళ్లు అంటే కెరీర్ పరంగా పదేళ్లు పూర్తయ్యే నాటికి నటిగా ఉన్నత స్థానంలోకి చేరుకుంది. ఈ జులై 21తో పదేళ్ల కెరీర్ని పూర్తిచేసుకున్న సందర్భంలో.. అనుష్కకి ఆ తేదికి ముందు, తరువాత ప్రత్యేకమైన చిత్రాలతో సందడి చేయడం విశేషం.
దశాబ్ద సినీ జీవితానికి కీలకమైన తేదికి ముందు జులై 10న 'బాహుబలి' కోసం దేవసేనగా విభిన్న వేషధారణ, నటనతో ప్రజాదరణ పొందిన ఆమె.. ఆ తేదికి తరువాత అక్టోబర్ 9న 'రుద్రమదేవి' కోసం రాజసం ఉట్టిపడే టైటిల్ రోల్లో అన్నీ తానై తెరపై సందడి చేయబోతోంది. హీరోయిన్గా పదేళ్ల కెరీర్ని పూర్తిచేసుకోవడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. అనుష్క ఆ మైల్ స్టోన్కి అటుఇటుగా చరిత్రలో నిలిచిపోయే పాత్రలతో, సినిమాలతో పలకరించడం అభినందనీయం. ఈ సందర్భంగా ఆమె అప్కమింగ్ ఫిల్మ్ 'రుద్రమదేవి' బ్లాక్బస్టర్ హిట్ కావాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com