నమ్మలేకపోతున్నాను అంటున్న అనుష్క....

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

అందం - అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌ధానాయిక‌ల్లో ఒక‌రు అనుష్క‌. సూప‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనుష్క అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అరుంథ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి...ఇలా న‌ట‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల్లో అద్భుత అభిన‌యం క‌న‌బ‌రిచి ప్రేక్ష‌కు హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకుంది. అయితే అనుష్క సినిమాల్లో అడుగుపెట్టి నేటికి స‌రిగ్గా 11 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ సంద‌ర్భంగా అనుష్క సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ లో ఇలా అన్న‌ది.
ఈ రోజు నా ఫ‌స్ట్ ఫిలిమ్ సూప‌ర్ సినిమా కోసం ఫ‌స్ట్ టైం కెమెరా ముందుకు వ‌చ్చిన రోజు. ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అప్పుడే 11 సంవ‌త్స‌రాలు అయ్యింది అంటే న‌మ్మ‌లేక‌పోతున్నాను. నా ఫ‌స్ట్ ఫిలిమ్ అక్కినేని నాగార్జున గారు, పూరి జ‌గ‌న్నాథ్ సార్ తో సూప‌ర్ సినిమా చేసాను. వండ‌ర్ ఫుల్ జ‌ర్నీ.న‌న్ను ఎంత‌గానో ఆద‌రిస్తున్న అభిమానుల‌కు, స్నేహితుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. మీ స‌పోర్ట్ లేక‌పోతే నేను ఈరోజు ఈ స్ధాయిలో ఉండేదాన్ని కాదు అంటూ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసింది స్వీటీ. అదేనండి అందాల అనుష్క‌.