అన్ని ఎమోషన్స్ ఉన్న జెన్యూన్ హిస్టారికల్ మూవీ రుద్రమదేవి : అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ చిత్రంతోతెలుగు తెరకు పరిచయమైన బెంగుళూరు భామ అనుష్క. అరుంథతి, బాహుబలి, రుద్రమదేవి...ఇలా విభిన్నమైన చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి ప్రేక్షక హ్రుదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది. అనతి కాలంలోనే ఇంతటి ఇమేజు..క్రేజు ఏర్పరుచుకున్న అనుష్క ఈనెల 9న రుద్రమదేవి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా రుద్రమదేవి గురించి అనుష్క చెప్పిన విశేషాలు మీకోసం...
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో...ఇలా డిఫరెంట్ రోల్స్ చేయాలని ప్లాన్ చేసుకుని చేస్తున్నారా..? లేక ఆ పాత్రలే మీ దగ్గరకి వస్తున్నాయా..?
నిజమే...మీరన్నట్టు డిఫరెంట్ రోల్స్ చేసాను. అరుంధతి పీరియడ్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. బాహుబలి జానపదం బ్యాక్‌డ్రాప్ తో రూపొందిన మూవీ. రుద్రమదేవి జెన్యూన్ హిస్టారికల్ మూవీ. సైజ్ జీరో కమర్షియల్ మూవీ. ఇలా డిఫరెంట్ రోల్స్ చేసాను. అయితే నేను ఏది ప్లాన్ చేయలేదు. అరుంధతి సినిమా చేసిన తర్వాత నేను ఈతరహా పాత్రలకు బాగుంటానని డైరెక్టర్స్ అనుకోవడంతో నాకు అవకాశాలు వచ్చాయి. అంతే కానీ నేను ప్లాన్ చేసి చేయలేదు.
రుద్రమదేవి 3డి లో తెరకెక్కించారు కదా.. ఎలా అనిపించింది..?
33డి లో నటించడం అంటే చాలా కష్టం. 3 డిలో ఒక సీన్ తీసిన తర్వాత మళ్లీ ఇంకో సీన్ తీయాలంటే లెన్స్ మార్చడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. ఆ 45 నిమిషాలు ఇంతకు ముందు సీన్ లో ఏ ఎమోషన్ తో ఉన్నామో...అదే ఎమోషన్ తో ఉండడం చాలా కష్టం. అందుచేత ..డైలాగ్ డెలివెరీ...కాస్టూమ్స్...ఇలా అన్నింటిలో చాలా జాగ్రత్తతో చేసాం.
అరుంధతి సినిమా కోసం కత్తి యుధ్దాలు నేర్చుకున్నారు కదా...అది రుద్రమదేవికి హోల్ప్ అయ్యిందా..? లేక రుద్రమదేవి కోసం ప్రత్యేకించి కత్తి యుధ్దాలు నేర్చుకున్నారా...?
అరుంథతి కోసం కొంచెమే నేర్చుకున్నాను. ఇక రుద్రమదేవి కోసం అయితే గుర్రం పై స్వారీ చేయడం కత్తి ఫైట్...నేర్చుకున్నాను. గుణ శేఖర్ గారు రుద్రమదేవి పాత్రకు తగ్గట్టు ఎలా ఫైట్ చేయాలి..గుర్రం పై ఎలా స్వారీ చేయాలి..ఇవన్నీ హైదరాబాద్ లోనే ట్రైనింగ్ ఇప్పించారు.
రుద్రమదేవి పాత్ర కోసం మీరు ఏమైనా హోమ్ వర్క్ చేసారా..?
రుద్రమదేవి పాత్ర కోసం హోమ్ వర్క్ చేద్దమాన్నా..అసలు రుద్రమదేవి ఎలా ఉంటుందో..ఎవరికీ తెలియదు. రుద్రమదేవి ఎలా ఉంటుందో చూద్దామని గూగుల్ లో సెర్చ్ చేస్తే..నా ఫోటోలే వచ్చాయి. గుణ శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసారు. అందుచేత ఆయన ఏమి చెబితే అది చేసాను.
రుద్రమదేవి రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది..? కారణం ఏమిటి..?
సినిమా చేయడం మన చేతుల్లో ఉంటుంది కానీ..రిలీజ్ చేయడమనేది మన చేతుల్లో ఉండదు. ఈ విషయాన్ని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు బెబుతుండేవారు. ఇది భారీ బడ్జెట్ మూవీ. పైగా 3డిలో మూవీ చేయడం అంటే మామూలు విషయం కాదు.అందుకనే రిలీజ్ వాయిదా పడిందని అనుకుంటున్నాను.
రానా సరసన నటించారు కదా..? స‌్ర్కీన్ పై మీ జంట ఎలా ఉంటుంది..?
ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి రానాతో పరిచయం ఉంది. రానా అనగానే భారీ ఆకారంతో కనిపిస్తాడు కానీ..ఈ మూవీలో రానాలోని రొమాంటిక్ యాంగిల్ కనిపిస్తుంది. స్క్రీన్ పై మా జంట చాలా ఫ్రెష్ గా ఉంటుంది..అందర్నీ ఆకట్టుకుంటుంది.
బాహుబలి, రుద్రమదేవి..ఈ రెండు సినిమాలు ఇంచు మించు ఒకేసారి చేసారు కదా..ఒకేసారి రెండు డిఫరెంట్ రోల్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా..?
బాహుబలి, రుద్రమదేవి..ఈ రెండు డిఫరెంట్ మూవీస్. రెండూ డిఫరెంట్ రోల్స్ ఒకేసారి చేస్తున్నప్పుడు ఎవరికైనా ఫస్ట్ షెడ్యూల్ వరకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆతర్వాత ఆ పాత్రల్లో బాగా ఇన్ వాల్వ్ కావడంతో ఇబ్బంది అనిపించదు. కానీ..ఈ మూవీస్ చేస్తున్నప్పుడు నాకు అలాంటి ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే రాజమౌళి, గుణ శేఖర్ ఇద్దరు ప్రతి విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. అందుచేత నాకు ఆ ప్రాబ్లమ్ రాలేదు.
అరుంధతి నుంచి రుద్రమదేవి వరకు మేకింగ్ లో మీరు గమనించిన తేడా ఏమిటి..?
అరుంధతి సినిమా చేస్తున్నప్పుడు గ్రీన్ క్లాత్ తీసుకుని ఎందుకు కడుతున్నారో అర్ధం కాలేదు. తర్వాత అర్ధం అయ్యింది. ఇక మేకింగ్లో తేడా అంటే ఈ ఐదేళ్లలో విజువల్ ఎఫెక్ట్స్ లో చాలా మార్పు వచ్చింది. బాహుబలి రుద్రమదేవి చిత్రాలకు జాతీయ స్ధాయి గుర్తింపు పొందిన టెక్నీషియన్స్ వర్క్ చేసారు. రాజమౌళి, గుణ శేఖర్ గారు బాగా ఎక్స్ ప్లెయిన్ చేసి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ నుంచి వాళ్ల కావలసిన విధంగా మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు.
రుద్రమదేవిలో హైలెట్ ఏమిటి..?
రుద్రమదేవిలో కథే హైలెట్. గుణ శేఖర్ గారు కథ చెబుతున్నప్పుడు ఇలాంటి కథ నిజంగా జరిగిందా అనిపించింది.ఈ కథ ఎంత అందంగా ఉంటుందో...అంత పెయిన్ కూడా ఉంటుంది. దీనిలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కథ ఇన్ స్పైయిర్ చేయడం వలనే రుద్రమదేవి చేసాను.
రుద్రమదేవి పాత్రకు పూర్తిగా న్యాయం చేసానని అనుకుంటున్నారా..?
సనిమా షూటింగ్ అయ్యాకా నేను గుణ శేఖర్ గారిని ఇదే అడిగాను. నేను మీరనుకున్నట్టే చేసానా అని..? అయితే ఆయన అనుకున్నట్టే చేసానని చెప్పారు. కానీ..నేను ఎలా చేసానని చెప్పాల్సింది ఆడియోన్స్. సో..సినిమా చూసాక ఆడియోన్స్ ఏ చెబుతారో అని వెయిట్ చేస్తున్నాను.
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి...ఇలాంటి అవకాశాలు మీకే వస్తున్నాయి. కారణం మీ అందమా..? అద్రుష్టమా..?
ఇలాంటి అవకాశాలు నాకు వచ్చాయంటే కారణం అద్రుష్టమే అనుకుంటాను. ఎందుకంటే నాకన్నా బాగా అందంగా ఉన్నవాళ్లు .. అలాగే నాకన్నా బాగా నటించే వాళ్లు ఉండొచ్చు. కానీ నాకే అలాంటి అవకాశాలు వచ్చాయంటే కారణం అద్రుష్టమే.
రుద్రమదేవి సినిమా కోసం మీరు ఆభరణాలు ధరించారు కదా..రియల్ లైఫ్ లో మీకు ఆభరణాలు అంటే ఇష్టమేనా..
నాకు అసలు ఆభరణాలు అంటే ఇష్టం ఉండదు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా..నగలు పెట్టుకునేదానిని కాదు. అమ్మే నగలు వేసుకోమనేది.చరిత్ర ఆధారంగా, స్కల్ప్చర్ డిజైన్స్ చూసి నీతాలుల్లా ఈ ఆభరణాల్ని డిజైన్ చేశారు. అయితే రుద్రమదేవి నగలు చూసాకా నేను నగలు కొనుక్కొంటున్నాను.
గోన గన్నారెడ్డి పాత్ర బన్ని చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్..
గోన గన్నారెడ్డి... గోన గన్నారెడ్డి అంటూ జనాలు అరిచే సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సీన్స్ తీస్తున్నప్పుడు ఈ పాత్రను ఎవరు చేస్తారబ్బా అనుకునేదాన్ని. బన్ని చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ పాత్రకు కరెక్ట్ పర్సన్ అనిపించింది. ఎందుకంటే వేదం సినిమా సెట్ కావడానికి కారణం బన్ని. అలాగే ఆ షూటింగ్ లో నా ఫెర్ ఫార్మెన్స్ గురించి సలహాలు కూడా ఇచ్చేవాడు. మంచి సినిమాలు చేయాలనుకునే బన్ని గోన గన్నారెడ్డి పాత్ర చేయడం నిజంగా హ్యాపీగా ఫీలయ్యాను.
రుద్రమదేవి సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారు..?
రుద్రమదేవి చాలా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడో విషయం చెప్పాలి...నేను ఊపిరి చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేసాను. అప్పుడు నాగార్జున గారు రుద్రమదేవి గురించి మాట్లాడుతూ...రుద్రమదేవి లుక్ చాలా బాగుంది. పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
నిత్యామీనన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నిత్యా మీనన్ చాలా బాగా నటిస్తుంది. నిత్యా మీనన్ తో చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. ఆమె పాత్ర ఏమిటని చెబితే కథ తెలిసిపోతుంది. అందుచేత చెప్పను. మీరు తెరపై చూడాల్సిందే.
ఇళయరాజా గారి గురించి..
నేను ఇళయారాజ గారి అభిమానిని. ఇప్పటి వరకు ఆయనను కలవలేదు.అయితే ఈ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ అనగానే ఆయన్ని ఆడియో ఫంక్షన్ లో కలుసుకోవచ్చు అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆతర్వాత గుణ శేఖర్ గారికి చెబితే చెన్నై తీసుకెళ్లి ఇళయరాజా గారికి పరిచయం చేసారు. ఆయన మ్యూజిక్ ఎలా చేస్తారో..మొత్తం నాకు వివరించారు. అదీ మరచిపోలేని అనుభూతి.
బాహుబలి చైనాతో పాటు మరిన్ని దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది కదా....అక్కడ నుంచి మీకు అవకాశాలు వస్తే నటిస్తారా...?
నాకు ఫ్రెంఛ్ మూవీస్ లో నటించాలని కోరిక. వాళ్ల సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే చైనీస్ కూడా. అవకాశం రావాలే కానీ..ఏ భాషలోనైనా నటిస్తా.
ఇన్నాళ్ల కెరీర్ లో మీరు పొందింది ఎంత..? పొగొట్టుకుంది ఎంత..?
నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి, ప్రభాస్..ఫ్యామిలీస్ తో మంచి అనుబంధం ఏర్పడింది. నేను ఇండస్ట్రీలో లేకపోయినా వారితో అనుబంధం అలాగే ఉంటుంది. ఈ పేరు..డబ్బు ఇదంతా పొందిందే. అమ్మా, నాన్నలను షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పుడు మిస్ అయ్యానని ఫీల్ అయ్యాదాన్ని. అందుచేత పొగొట్టుకుంది చాలా తక్కువే.
కెరీర్ లో మీరు మిస్ అయిన సినిమాలు..?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, విశ్వరూపం.
తదుపరి చిత్రాలు గురించి..?
బాహుబలి 2, సింగం 3 ఈ రెండు పూర్తి చేయడానికి చాలా టైం పడుతుంది. అందుచేత వేరే సినిమాలు అంగీకరించడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com