త్రిష,సమంత స్థానంలో అనుష్క?
Send us your feedback to audioarticles@vaarta.com
త్రిష, సమంత స్థానంలోకి అనుష్క రానుందా? ఇప్పటికిప్పుడు వారి స్థానాల్లోకి అనుష్క ఎందుకు వస్తోంది? అని అనుకుంటున్నారా? నిజంగానే వారి స్థానంలోకి అనుష్క రానుందట. సమంత హీరోయిన్గా నటించిన 'ఏమాయ చేశావె' సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది.
తమిళంలో ఈ సినిమాలో త్రిష నటించింది. ఆ పాత్ర సీక్వెల్ కోసం గౌతమ్ మీనన్ అనుష్కను ఎంపిక చేశారట. ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్న అనుష్క త్వరలోనే ఆ ప్రాజెక్టులో ఎంటరవుతారట. శింబు తమిళ్లో హీరోగా నటిస్తారు. తెలుగులో ఎవరు నటిస్తారనేది ఇంకా సస్పెన్స్.
రెండు భాషల్లోనూ ఆ పాత్రకు అనుష్క అయితే నాయికగా న్యాయం చేస్తుందని గౌతమ్ మీనన్ అభిప్రాయమట.త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని వినికిడి. శింబుతో కలిసి గతంలో అనుష్క 'వానమ్' అనే సినిమాలో చేశారు. అది తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'వేదం' సినిమాకు రీమేక్ .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments