నాగ‌ర‌త్న‌మ్మ‌ బయోపిక్ లో అనుష్క ?

  • IndiaGlitz, [Monday,March 23 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వ‌ర‌లోనే ఓ బ‌యోపిక్‌లో నటించ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వినిపిస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి చిత్రాలు మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. అలాగే ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన నిశ్శ‌బ్దం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. క‌రోనా ప్ర‌భావం లేకుంటే ఈ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది.

అయితే తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ఓ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఆ బ‌యోపిక్ ఎవ‌రిదో కాదు.. బెంగుళూరుకి చెందిన సింగ‌ర్ నాగ‌ర‌త్న‌మ్మ‌ది. దేవ‌దాసీ కుటుంబంలో పుట్టి సంగీత క‌ళాకారిణిగా ఎదిగిన నాగ‌ర‌త్న‌మ్మ త్యాగ‌య్య సంగీతాన్ని అభిమానించారు. ఆయ‌న స‌మాధి బాగోగుల‌ను చూడ‌ట‌మే కాకుండా.. త‌న సంపాద‌నంతా సంగీత క‌ళాకారుల‌కు ధార‌పోసింది. ఈమె పాత్ర‌లో అనుష్క‌ను తీసుకుంటే బావుంటుంద‌ని సింగీతం భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్‌. మ‌రి అనుష్క ఓకే అంటుందో లేదో వేచి చూడాలి.

More News

మ‌హేశ్ 27 దాదాపు ఖ‌రారైన‌ట్టేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా గురించి అభిమానులు అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది త‌న 26వ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’తో భారీ హిట్ అందుకున్న మ‌హేశ్ 27వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో

లెజండరీ దర్శకనిర్మాత విసు కన్నుమూత

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్‌, నిర్మాత, ద‌ర్శకుడు విసు ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..

ఏపీలోనూ మార్చి 31 వరకు లాక్‌డౌన్

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కీలక ప్రకటన చేశారు.

కేసీఆర్ కీలక నిర్ణయం.. మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్

కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న తరుణంలో.. వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని

డిజిట‌ల్‌లో నిర్మాత‌గా మారిన క్రిష్‌...!!

విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్‌ల‌తో చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. గమ్యం, వేదం, కృష్ణంవందే జ‌గ‌ద్గుర‌మ్‌, కంచె వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఆయ‌న సినిమాల్లో