భానుమతి పాత్రలో అనుష్క....
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అనుష్క.. రీసెంట్గా `భాగమతి`తో మంచి విజయాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఓ డిఫరెంట్ పాత్రలో నటించడానికి రెడీ అవుతోందని సమాచారం. వివరాల్లోకెళ్తే.. కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `మహానటి`. అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సీనియర్ నటి భానుమతి పాత్రలో అనుష్క నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. సావిత్రి జీవితంలో కీలకపాత్ర పోషించిన భానుమతిగారి పాత్రలో అనుష్క నటించడం ఆసక్తిని రేపుతుంది. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments