భానుమతి పాత్రలో అనుష్క....

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న అనుష్క‌.. రీసెంట్‌గా 'భాగ‌మ‌తి'తో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. త్వ‌ర‌లోనే ఓ డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించ‌డానికి రెడీ అవుతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. కీర్తిసురేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌హాన‌టి'. అలనాటి మ‌హానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సీనియ‌ర్ న‌టి భానుమ‌తి పాత్ర‌లో అనుష్క న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సావిత్రి జీవితంలో కీల‌క‌పాత్ర పోషించిన భానుమ‌తిగారి పాత్ర‌లో అనుష్క న‌టించ‌డం ఆస‌క్తిని రేపుతుంది. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.