వెబ్ రంగంలోకి అనుష్క‌....

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

విరాట్ కోహ్లి స‌తీమ‌ణి.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నారు. ఇంత‌కు ముందు ఎన్‌.హెచ్ 10, ఫిలౌరి, ప‌రి చిత్రాల‌ను అనుష్క నిర్మించారు. త్వ‌ర‌లోనే ఈమె డిజిట‌ల్ రంగంలోకి కూడా నిర్మాత‌గా అడుగుపెట్ట‌నున్నారు.

ఎన్‌హెచ్ 10, ఊడ్తా పంజాబ్ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన సుదీప్ శ‌ర్మ ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది. ఈ ఏడాది ఆఖ‌రున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప‌ది ఏపిసోడ్స్‌లో తొలి సీజ‌న్ షూటింగ్‌ను పూర్తి చేస్తార‌ట‌.