మల్టీస్టారర్ మూవీలో అనుష్క?
Send us your feedback to audioarticles@vaarta.com
'భాగమతి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు సీనియర్ కథానాయిక అనుష్క. ప్రస్తుతం స్వీటీ కొత్త కథలను వినే క్రమంలో ఉన్నారు. అయితే.. ఈ లోపు ఓ రూమర్ తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. నాగార్జున, నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం విదితమే.
శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు కాగా.. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండగా.. వారిలో ఒకరిగా అనుష్క పేరు వినిపిస్తోంది. నాగ్ పోషిస్తున్న డాన్ పాత్రకి జోడీగా అనుష్క కనిపించనుందని సమాచారం.
గతంలో వీరిద్దరూ 'సూపర్', 'డాన్', 'రగడ', 'ఢమరుకం' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కాగా, అనుష్క ఎంపిక విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. నానికి జోడీగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఫైనల్ చేసారని తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com