వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంలో అనుష్క..!
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది. గత ఏడాది అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ఓటీటీలో విడుదలై అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వెంటనే మరో సినిమాలో చేయకుండా ఫిజిక్ మీద అనుష్క కాస్త ఫోకస్ పెట్టింది. కాస్త గ్యాప్ తీసుకోవడం, కోవిడ్ ప్రభావం.. వంటి పరిస్థితులతో అనుష్క శెట్టి సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుని నెక్ట్స్ మూవీకి సిద్ధమైంది. ‘రా రా కృష్ణయ్య’ దర్శకుడు మహేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ విలక్షణమైన ప్రేమకథా చిత్రంలో నటించడానికి అనుష్క ఓకే చెప్పిందని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
విలక్షణమైన ప్రేమకథా చిత్రంలో అనుష్క నటించడమా? ఇంతకీ అనుష్కకు నచ్చిన అంత కొత్త కథేంటి? అనే సందేహం రాకమానదు. వివరాల్లోకి వెళితే, నలభై ఏళ్లున్న అమ్మాయికి, పాతికేళ్ల అబ్బాయికి మధ్య నడిచే లవ్‌స్టోరితో ఓ కథను రూపొందించాడట దర్శకుడు మహేశ్. ఈ సినిమాలో అనుష్కను ప్రేమించే పాతికేళ్ల కుర్రాడి పాత్రలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి నటించబోతున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com