'నిశ్శబ్దం' గా అనుష్క కష్టం
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది `భాగమతి`తో హిట్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి.. సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అందుకు కారణం ఆమె పెరిగిన వెయిట్‌ను తగ్గించుకోవడానికే. ప్రత్యేకమైన శిక్షణ, డైట్‌ను పాటించిన తర్వాత అనుష్క బరువు తగ్గింది. ప్రస్తుం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుంది. ఇలాంటి పాత్రలో నటించడానికి చాలా శిక్షణ తీసుకుని మరీ నటించిందట.
మూగ, చెవిటి అమ్మాయిగా నటించే క్రమంలో అలాంటి పిల్లలుండే పాఠశాలకు వెళ్లి వారితో పాటు కొన్నిరోజులు ట్రావెల్ అయ్యిందట. వారు వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారనే దానిపై అబ్జర్వ్ చేసి హావభావాలను నేర్చుకుని మరీ నటించిందట. అలాగే అనుష్క పాత్ర సినిమాలో ఓ పెయింటర్. కాబట్టి ఓ పెయింటర్ దగ్గర పెయింటింగ్‌లో ప్రత్యేకమైన శిక్షణను తీసుకుని మరీ నటించిందట. అలాగే సినిమా చిత్రీకరణ సమయంలో ఓ పెయింటింగ్ కూడా వేసిందట. ఈ పెయింటింగ్‌ను సినిమాలో చూపించబోతున్నారని టాక్.
అనుష్క, మాధవన్, మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే తదితరులు కీలక పాత్రధారులుగా నటిస్తోన్న ఈ చిత్రం అమెరికాలో చిత్రీకరణను జరుపుకుంది. టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ నిర్మాతలు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments