క్రిష్ణవంశీకి ఓకె చెప్పిన అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ మూవీకి రుద్రాక్ష అనే టైటిల్ అనుకున్నారు. కానీ..ఈ టైటిల్ వేరే వాళ్లు రిజిష్టర్ చేయించుకోవడంతో కొత్త టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ మూవీలో ప్రధాన పాత్రకు సమంతను ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా ప్రధాన పాత్రకు అనుష్క ను ఫైనల్ చేసినట్టు సమాచారం. క్రిష్ణవంశీ చెప్పిన కథ విన్న అనుష్క కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...ఫామ్ లో లేని క్రిష్ణవంశీకి ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments