అల్లు అర్జున్ బాటలో అనుష్క?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సంవత్సరం అనుష్క కెరీర్‌లో ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే.. ఈ సంవత్సరం అనుష్క నటించిన తెలుగు సినిమాలన్నీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే. 'బాహుబలి', 'రుద్రమదేవి'లతో ఇప్పటికే తన గురించి మాట్లాడేలా చేసిన అనుష్క.. రేపు రిలీజ్ కానున్న 'సైజ్ జీరో'తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే పాత్రతో కనువిందు చేయనుంది. తెలుగు, తమిళ భాషల్లో 1500 స్క్రీన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా.. అనుష్క గత రెండు చిత్రాల మాదిరిగానే ఓ ఫీట్‌ని కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అదేమిటంటే.. 50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టడం. 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలు 50 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో 'సైజ్ జీరో' కూడా అదే బాటలో పయనించి.. అనుష్క కి ఒకే ఏడాదిలో మూడు యాభై కోట్ల షేర్ సాధించిన చిత్రాల నాయికగా ప్రత్యేక గుర్తింపుని తీసుకువస్తుందో లేదో అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హీరోలలో అల్లు అర్జున్ వరుసగా మూడు యాభై కోట్ల రూపాయిల వసూళ్లను సాధించిన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నట్లే.. హీరోయిన్‌లలో అనుష్క కూడా అదే బాట పడితే కనుక చరిత్ర సృష్టించినట్లే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com