11 ఏళ్ల తర్వాత అనుష్క సినిమా రీమేక్...!!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. సూపర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు అందరు సూపర్‌స్టార్స్‌తో నటించింది. అయితే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం ‘అరుంధతి’. ఈ సినిమాతో అనుష్క 50 కోట్ల హీరోయిన్గా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్‌గా మారింది. ఈ సినిమా విడుదలై 11ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటెంట్‌కు బాలీవుడ్లో ఆదరణ పెరుగుతుంది. అర్జున్‌రెడ్డి బాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. దీంతో పాటు ‘జెర్సీ, హిట్, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఇలా చాలా చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రాల బాటలో అరుంధతి చిత్రం కూడా చేరనుంది.
తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ‘అరుంధతి’ బాలీవుడ్ రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను ఈ రీమేక్‌లో నటింప చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ‘అరుంధతి’ రీమేక్ ట్రాక్ ఎక్కితే ఆ సినిమాలో.. తెలుగులో సోనూసూద్ చేసిన పాత్రను బాలీవుడ్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com