అనుష్క ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న అనుష్క శెట్టి తన నిశ్శబ్దం సినిమా విడుదల కోసం వేచి చూస్తుంది. ఈ సినిమా తర్వాత అనుష్క అసులు ఏ సినిమా చేస్తుందనే దానిపై క్లారిటీ లేదు. ఈరోజు అనుష్క శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఆ ఎమోషనల్ పోస్ట్ చూస్తుంటే మనుషులు మానసికంగ ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఆమె తన మెసేజ్ ద్వారా తెలియజేసినట్లుగా అనిపిస్తుంది.
‘‘మనకు అర్థమైన విధంగా, తెలిసిన విధంగా మనం పరిస్థితులను హ్యాండిల్ చేస్తుంటాం. అయితే ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఇదే కరెక్ట్... ఇది తప్పు అని చెప్పడానికి ఏమీ లేదు. మనం రోడ్డు మ్యాప్‌తో పుట్టలేదు. మనసులో బాధ ఉన్నప్పుడు బయటపడాలనిపిస్తే పడటమే..! కొన్నిటికి దూరంగా ఉండాలంటే ఉండటమే. ఎవరికి తోచిన మార్గాన్ని వారు ఎంపిక చేసుకోవడమే మంచిది. ఇతరులతో సహానుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. దయతో ప్రవర్తిద్దాం. ఇతరులను ఇంకాస్త ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. ఇతరులు చెప్పేవి విందాం... ఇతరులతో మాట్లాడుదాం. కొన్నిసార్లు బలహీనంగా అనిపించినా ఫర్వాలేదు. కొన్నిసార్లు మరింత బలంగా మారడం నేర్చుకుందాం. మనందరం మనుషులం. చిన్న నవ్వు, పలకరింపు, చిన్న స్పర్శ, అవతలివారి మాటలు వినడం... ఇవన్నీ పరస్పరం ఎంతో దోహదపడతాయి. వీటివల్ల ఉన్నపళాన పరిస్థితులు మారిపోవు. కానీ చిన్న మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పు నెమ్మదిగా ప్రతిఫలిస్తుంది.... స్టే సేఫ్. మనమంతా మనుషులం... ఎప్పుడూ నవ్వుతూ ఉందాం!’’ అని పోస్ట్ చేశారు అనుష్క.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com