అసిన్ పెళ్లి పై కామెంట్ చేసిన అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..టాప్ స్టార్స్ తో కలసి నటించిన అందాల భామ అసిన్. గజని సినిమాలో నటించిన అసిన్ ఆ..సినిమాలో ఎలాగైతే ఓ సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుందో... రియల్ లైఫ్ లో కూడా అలాగే మైకోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడింది.
రాహుల్ శర్మ, అసిన్....వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే.. అసిన్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటుంది కదా...మీరు కూడా బిజినెస్ మ్యాన్ నే పెళ్లి చేసుకుంటారా అని అనుష్కని అడిగితే...అసిన్ కావాలని ప్లాన్ చేసి బిజినెస్ మ్యాన్ ని ప్రేమించలేదు. రాహుల్ శర్మ..అక్షయ్ కుమార్ ఫ్రెండ్. అసిన్, అక్షయ్ కలసి సినిమా చేస్తున్నప్పుడు రాహుల్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త..పరిణయానికి దారి తీసింది. అంతే తప్ప కావాలని ప్లాన్ చేసింది కాదు అంటూ అసిన్ ని వెనకేసుకొస్తుంది అనుష్క.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com