అనుష్క పాత్ర ఏంటంటే....
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న `భాగమతి` చిత్రంలో నటిస్తుంది. జనతాగ్యారేజ్లో నటించిన ఉన్న ముకుందన్ అనుష్కతో సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలోని పాత్ర కోసం అనుష్క బరువు కూడా వర్కవుట్స్ గట్రా చేసి బరువు కూడా తగ్గింది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలోని ఈ సినిమాలో అనుష్క మరో డిఫరెంట్ పాత్రలోకనపడనుందట. ఇంతకీ ఆ పాత్ర ఏంటనుకుంటున్నారా...కలెక్టర్ పాత్ర. బాహుబలిలో దేవసేన పాత్రలో కనపడ్డ అనుష్క తర్వాత రానున్న భాగమతిలో కలెక్టర్గా కనపడనుంది. ఈ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమా తర్వాత అనంత పద్మనాభస్వామి నిధి నిక్షేపాలపై ఓ సినిమా తీయబోతున్నాడు. వందకోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా బాలీవుడ్ సహా దక్షిణాదికి చెందిన నటీనటులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com