అనుష్క పాత్ర ఏంటంటే....

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న 'భాగమతి' చిత్రంలో నటిస్తుంది. జ‌న‌తాగ్యారేజ్‌లో న‌టించిన ఉన్న ముకుంద‌న్ అనుష్క‌తో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలోని పాత్ర కోసం అనుష్క బ‌రువు కూడా వ‌ర్కవుట్స్ గ‌ట్రా చేసి బ‌రువు కూడా త‌గ్గింది.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోని ఈ సినిమాలో అనుష్క మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌లోక‌న‌ప‌డ‌నుంద‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏంట‌నుకుంటున్నారా...క‌లెక్ట‌ర్ పాత్ర‌. బాహుబ‌లిలో దేవ‌సేన పాత్ర‌లో క‌న‌ప‌డ్డ అనుష్క త‌ర్వాత రానున్న భాగ‌మ‌తిలో క‌లెక్ట‌ర్‌గా క‌న‌ప‌డ‌నుంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు అశోక్ ఈ సినిమా త‌ర్వాత అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి నిధి నిక్షేపాల‌పై ఓ సినిమా తీయ‌బోతున్నాడు. వంద‌కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదికి చెందిన న‌టీన‌టులు న‌టిస్తున్నారు.