పట్టుదలే కారణం అంటున్నఅనుష్క బ్రదర్
Wednesday, June 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అనతి కాలంలోనే తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నబెంగుళూరు భామ అనుష్క. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి....ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ తన కోసమే రచయితలు కథలు రాసేలా ఇమేజు, క్రేజు సంపాదించుకుంది. గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిలో నటనకు గాను అనుష్క ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ ను గెలుచుకుంది. ఈ సందర్భంగా అనుష్క బ్రదర్ గుణరంజన్ శెట్టి రుద్రమదేవి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియచేసారు. సినీ పరిశ్రమలో కృషి, పట్టుదల, అంకితభావంతో కష్టించి పని చేయడంతో ఈ విజయం దక్కింది. సోదరి అనుష్కను చూసి గర్విస్తున్నాను అంటూ గుణరంజన్ శెట్టి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బ్రదర్ స్పందనకు అనుష్క థ్యాంక్సూ బ్రో...అంటూ ఫేస్ బుక్ లో స్పందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments