డిసెంబర్ లో 'భాగ్ మతి'?
Send us your feedback to audioarticles@vaarta.com
అరుంధతితో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు మళ్లీ ఊపు వచ్చింది. కంటెంట్ బాగుంటే.. విమెన్ సెంట్రిక్ సినిమాలకు కూడా స్టార్ హీరోల స్థాయిలో కలెక్షన్లు రాబట్టవచ్చని ఆ చిత్రం నిరూపించింది. ఇక అందులో నటించిన తరువాతే అనుష్క స్థాయి పెరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, అరుంధతి తరువాత పంచాక్షరి, రుద్రమదేవి తదితర హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా.. అనుష్కకి ఆ స్థాయి గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. అదే భాగ్‌మతి.
హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అతి త్వరలోనే స్క్రీన్ పైకి రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా.. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైంది. అన్నీ కుదిరితే డిసెంబర్‌లో భాగ్‌మతిని విడుదల చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి2 తరువాత అనుష్క నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments