'భాగమతి' సబ్జెక్ట్ ఏమిటంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో.. ఇలా ఈ తరంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచిన కథానాయిక అనుష్క శెట్టి. ఇటీవల బాహుబలి2లో దేవసేనగా అలరించిన అనుష్క.. ప్రస్తుతం భాగమతి చిత్రంతో బిజీగా ఉంది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.
రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. టీజర్ చూసిన వాళ్లంతా అరుంధతి తరహాలో ఈ సినిమా కూడా హారర్ థ్రిల్లర్ అని అనుకుంటున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భాగమతి ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలిసింది. 500 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనకి సమకాలీన పరిస్థితుల నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. టీజర్లో చూపించిన పాడుబడిన కోట.. కథలో కీలకమైన అంశమని తెలిసింది.
ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే జనవరి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com