'భాగ‌మ‌తి' నిడివి

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

'బాహుబ‌లి - ది కంక్లూజ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత అనుష్క క‌థానాయిక‌గా వ‌స్తోన్న‌ చిత్రం 'భాగ‌మ‌తి'. 'పిల్ల జ‌మీందార్' ఫేమ్ అశోక్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ నిర్మించింది. మ‌ల‌యాళ న‌టులు ఉన్ని ముకుంద‌న్‌, జ‌య‌రామ్‌, ఆశా శ‌ర‌త్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్‌ని జారీ చేసింది. స‌ర్టిఫికేట్ ప్ర‌కారం.. ఈ సినిమా నిడివి 142 నిమిషాలు (2.22 గంట‌లు) ఉంది. ఈ డ్యూరేష‌న్ సినిమాకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు.

త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ ఆడియో బుధ‌వారం విడుద‌లైంది. తెలుగు ఆడియో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. 'అరుంధ‌తి' త‌రువాత అనుష్క చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఏవీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

More News

కొత్త పాత్ర‌లో అను....

ఈ ఏడాది 'అజ్ఞాతవాసి' చిత్రంలో అమాయకమైన అమ్మాయి పాత్రలో దర్శనమిచ్చిన కేరళకుట్టి అనుఇమాన్యుయేల్. ఇప్పుడు అవేశం, దూకుడు స్వభావాలున్న అమ్మాయి పాత్రలో నటించనుంది.

ఛలో ఫిబ్రవరి 2న రిలీజ్

ఛలో..హిట్ కొట్టడానికి ఛల్ ఛలో..ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అనిపించిన భావన ఇదే.

'బంగారి బాలరాజు' మూవీలో ముంబై ఐటంగర్ల్ శాంతాబాయ్

నంది క్రియేషన్స్ బ్యానర్ పై  కె. ఎండి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ 'ట‌చ్ చేసి చూడు'!

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన‌ 'టచ్ చేసి చూడు' చిత్రాన్నిఅతి  త్వరలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన  విక్రమ్ సిరికొ&

మోహన్ బాబు కు 'విశ్వ నట సార్వభౌమ' బిరుదు ప్రధానం

తెలుగులో పదునైన డైలాగులు సంధించడంలో తనకు తానే సాటి అని మోహన్‌బాబు రుజువు చేసుకున్నారు. ఆయన డైలాగ్‌లు వినే వాళ్లను మంత్రుముగ్ధుల్ని చేసే శక్తి మోహన్‌బాబు సొంతం. ఆయనకు కొంచెం కోపం కూడా వుంది. నాకు బాగా తెలుసు. ఒక శాతం కోపం వుంటే 99 శాతం ఆయనలో మంచితనం వుంది. 42 ఏళ్ల సినీ ప్రస్థానంలో 560కి పైచిలుకు చిత్రాల్లో నటించి ఎందరినో మెప్పించారు.