'భాగ‌మ‌తి' నిడివి

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

'బాహుబ‌లి - ది కంక్లూజ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత అనుష్క క‌థానాయిక‌గా వ‌స్తోన్న‌ చిత్రం 'భాగ‌మ‌తి'. 'పిల్ల జ‌మీందార్' ఫేమ్ అశోక్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ నిర్మించింది. మ‌ల‌యాళ న‌టులు ఉన్ని ముకుంద‌న్‌, జ‌య‌రామ్‌, ఆశా శ‌ర‌త్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్‌ని జారీ చేసింది. స‌ర్టిఫికేట్ ప్ర‌కారం.. ఈ సినిమా నిడివి 142 నిమిషాలు (2.22 గంట‌లు) ఉంది. ఈ డ్యూరేష‌న్ సినిమాకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు.

త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్ ఆడియో బుధ‌వారం విడుద‌లైంది. తెలుగు ఆడియో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. 'అరుంధ‌తి' త‌రువాత అనుష్క చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఏవీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ సినిమా అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.