'అమ్మ'గా అనుష్క..!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితను అందరూ 'అమ్మ' అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పై బయోపిక్‌ల వెల్లువ కురుస్తోంది. తాజాగా సీనియర్ డైరక్టర్ భారతిరాజా కూడా తనవంతు ప్రకటించేశారు. ఆదిత్య భరద్వాజ్ నిర్మాణంలో ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చనున్నట్టు ప్రకటన వెలువడింది.ఇందులో నటించడానికి అమ్మ పాత్ర కోసం అనుష్కను, ఐశ్వర్యను సంప్రదిస్తున్నామన్నది ఆ వార్త సారాంశం. జయలలిత కూడా కన్నడిగ.
ఆమెకు కర్ణాటకతో ఎంతటి సంబంధం ఉందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టు కర్ణాటకకు చెందిన అనుష్క, ఐశ్వర్య పేర్లు బయటికి రావడం ఒకింత కో ఇన్సిడెన్సే. అయినా ఇప్పుడు భారతిరాజా దర్శకత్వంలో నటించడానికి వీరిద్దరిలో ఎవరు ముందుకొస్తారో వేచి చూడాలి. ఒకవేళ అనుష్క భారతిరాజా సినిమాకు ఓకే చెప్పకపోయినప్పటికీ విష్ణు ఇందూరి తెరకెక్కించే సినిమాకు సై అనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సో అదే నిజమైతే విష్ణు ఇందూరి సినిమాలో ఎంజీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు? అనేది తేలాల్సిన విషయం. అమ్మగా నటించడానికి పలువురు నటీమణులు ఆసక్తి చూపుతున్న మాట వాస్తవమే. అయితే ఎంజీఆర్‌గా సరిపోయే హీరోలు ఎంతమంది ఉన్నారనేది లెక్కపెట్టాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments