పుట్టినరోజు వేళ అభిమానులకు అనుష్క సర్‌ప్రైజ్.. 48వ సినిమాకు గ్రీన్‌సిగ్నల్

  • IndiaGlitz, [Sunday,November 07 2021]

అనుష్క శెట్టి .. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ సౌతిండియా మహిళా సూపర్‌స్టార్‌‌గా, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌లలో ఒకరిగా అనుష్క వెలుగొందుతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. కాగా అనుష్క ఇవాళ తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే నిశ్శబ్దం తర్వాత మరో సినిమాకు అనుష్క ఓకే చెప్పలేదు. దీంతో ఆమె త్వరలో పెళ్లి పీటలెక్కనుందని.. సినిమాలకు దూరం కానుందని ఇలా రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రూమర్‌లకి చెక్ పెట్టారు జేజేమ్మ. తన తదుపరి ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మరోవైపు యూవీ క్రియేషన్స్ - అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఆ బ్యానర్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘భాగమతి’, అనుష్కకు మంచి హిట్స్‌ అందించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో పి వాసు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'చంద్రముఖి' సీక్వెల్‌లో అనుష్క నటించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ విన్నా అనుష్క ఈ సినిమాను ఓకే చేసిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More News

#MEGA154: ఊర నాటు లుక్‌లో మాస్ మూల విరాట్ .. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు. 70కి చేరువవుతున్నా కుర్రాళ్ల కంటే స్పీడుగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను రెడీ

"ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే" : శ్యామ్‌ సింగరాయ్‌ లిరికల్‌ సాంగ్‌ అదరహో

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లు.

రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ 'జయమ్మ పంచాయితీ' ఫస్ట్ లుక్‌

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

లాంఛనంగా ప్రారంభ‌మైన మెగాస్టార్ చిరంజీవి - బాబీ చిత్రం

మెగాస్టార్ 154 వ చిత్రాన్ని టాలీవుడ్ అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు.

"అన్నాత్తే రిలీజ్".. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్, అది రజనీ అంటే

రజనీకాంత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన కృషి, పట్టుదల, కార్యదీక్షతో సాధారణ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.