మళ్లీ అలాగే వస్తున్న అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఓ సారి కలిసిరాని అంశంతోనే రెండోసారీ ఓ సినిమా తెరకెక్కుతుందంటేనే సదరు చిత్రం ఫలితంపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. అలాంటిది మొదటి సినిమా రిలీజైన సీజన్లోనే రెండో సినిమా కూడా వస్తోందంటే వారి అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇదే వైనం అనుష్క కొత్త చిత్రం 'సైజ్ జీరో' విషయంలోనూ చోటు చేసుకుంటోంది. ఇంతకుముందు అనుష్క.. తమిళ కథానాయకుడు ఆర్యతో 'ఇరండాం ఉలగం' (తెలుగులో వర్ణ) కోసం నటించింది. అది కాస్త బాక్సాఫీస్ వద్ద పల్టీ పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి నటించారు 'సైజ్ జీరో' కోసం. ఈ సినిమా తమిళంలోనూ 'ఇంజి ఇడుప్పళగి' పేరుతో రిలీజ్ కాబోతోంది. మొదటిసారి ఈ కాంబినేషన్ డిజాస్టర్ ఇవ్వడమే కొత్త సినిమాపై అంతగా ఆసక్తిని కలిగించకుంటే.. ఇప్పుడేమో ఏకంగా 'వర్ణ' రిలీజైన నవంబర్లోనే 'సైజ్ జీరో' ప్రేక్షకుల ముందుకు రావడం మరింత నెగెటివ్ టచ్ ఇస్తున్నట్లయ్యింది. 'వర్ణ' సెంటిమెంట్స్‌ని 'సైజ్ జీరో బ్రేక్' చేయాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com