పెళ్ళి గురించి అనుష్క మనసులో మాట...

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అందాల తార అనుష్క‌. ఇటీవ‌ల బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నఅనుష్క తాజాగా సైజ్ జీరో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించిన సైజ్ జీరో మూవీ ఈ నెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అనుష్క ని పెళ్లి ఎప్పుడు అని అడిగితే...అస‌లు నేను హీరోయిన్ అవుతాన‌ని అనుకోలేదు.. అయ్యాను..అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాను అనుకోలేదు..కానీ చేస్తున్నాను. అలాగే పెళ్లి గురించి కూడా ఏమి అనుకోవ‌డం లేదు. టైం ఎప్పుడు వ‌స్తే అప్పుడే జ‌రుగుతుంది అంటూ వేదాంతం మాట్లాడుతుంది అందాల అనుష్క‌.