దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది: పాయల్‌పై అనురాగ్ కశ్యప్ ఫైర్

హీరోయిన్ పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో పాయల్ ఆరోపణలపై అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పడు మాట్లాడుతున్నారని అయినా ఫర్వాలేదన్నారు. పాయల్ ఒక అమ్మాయిగా ఉండి ఇతర అమ్మాయిలను వివాదంలోకి లాగిందని.. దైనికైనా ఓ లిమిట్ ఉంటుందంటూ కాస్త ఘాటుగానే అనురాగ్ కశ్యప్ స్పందించారు.

తనపై పాయల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసే క్రమంలో తనతో పని చేసిన నటీనటులతో పాటు అమితాబ్ ఫ్యామిలీని కూడా ఈ వ్యవహారంలోకి లాగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని అదే తన నేరమైతే అంగీకరిస్తానన్నారు. తన మొదటి భార్య, రెండో భార్య, తన ప్రేయసి అందరిపై ఆరోపణలు చేశారని.. పాయల్ ప్రవర్తన భరించరానిదని అనురాగ్ పేర్కొన్నారు. మీ వీడియో చూస్తే అందులో నిజానిజాలెంతో తెలుస్తాయన్నారు.

కాగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అనురాగ్ కశ్యప్‌పై ఏకంగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ రూపంలో ఉన్న రాక్షసుడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని కాబట్టి తనను కాపాడాలంటూ ట్విట్టర్ వేదికగా ప్రధానిని వేడుకుంది. అవకాశం ఇస్తానని తనను అనురాగ్ కశ్యప్ తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడికి యత్నించారని పాయల్ వెల్లడించింది. రెండు సార్లు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించింది. అమితాబ్, కరణ్ జోహార్ వంటి వారంతా తనకు చాలా క్లోజ్ అని చెప్పి బలవంతంగా లోబరుచుకోవాలని చూశాడని పాయల్ ఆరోపించింది. 2015లో బాంబే వెల్వెట్ సినిమా తీస్తున్న సమయంలో తనపై రేప్‌నకు యత్నించారని పాయల్ తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ దాడి చేస్తానని అనురాగ్ కశ్యప్ బెదిరించారని వెల్లడించింది.

More News

చైనా నిఘా వర్గాలకు కీలక సమాచారం చేరవేత.. జర్నలిస్ట్ అరెస్ట్..

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏ రాత్రి అందంగా  ముగుస్తుందో అదే గ్రేట్‌ డే:  పూరీ జగన్నాథ్‌

పూరి మ్యూజింగ్స్‌ పేరుతో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ..కొన్ని రోజులుగా కొన్ని అంశాలపై మాట్లాడుతున్నారు.

'బోగ‌న్‌' ఈ నెల 26 న ట్రైలర్ విడుదల

త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా రాణిస్తున్న 'జ‌యం' ర‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచితుడే.

మతం మార్చుకున్న నటి సంజనా.. తీవ్ర స్థాయిలో రూమర్స్..

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన శ్యాండిల్ వుడ్ బ్యూటి, బహుబాష నటి సంజనా గల్రాని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.

నేడు దేత్తడి హారిక బిగ్‌బాస్ నుంచి అవుట్..

బిగ్‌బాస్ సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున షోని అంతా తానై నడిపిస్తున్నారు.