అనుపమకి అది రిపీట్ అవుతుందా?

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

అఆ, ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వతి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ప్ర‌స్తుతం ఈ కేర‌ళ‌కుట్టి.. రామ్‌తో 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ', నానితో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలు చేస్తోంది. వీటిలో 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' ఈ నెల 27న విడుద‌ల‌కి సిద్ధ‌మవుతోంది. ఇందులో అనుప‌మ‌తో పాటు లావ‌ణ్య త్రిపాఠి కూడా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమాకి నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఇదే అక్టోబ‌ర్‌లో అనుప‌మ న‌టించిన ప్రేమ‌మ్ చిత్రం విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే.. ఆమె తాజా చిత్రం ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ కూడా అదే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌రి ప్రేమ‌మ్‌లాగే ఫీల్‌గుడ్ మూవీగా తెర‌కెక్కిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ కూడా విజ‌యం సాధించి అనుప‌మ మ‌రో విజ‌యాన్ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.