సేమ్ టు సేమ్ అంటున్న అనుపమ
Send us your feedback to audioarticles@vaarta.com
అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో ఇప్పటివరకు ఈ కేరళ కుట్టి నటించిన సినిమాల సంఖ్య ముచ్చటగా మూడే. కానీ ఆ మూడు చిత్రాలూ మంచి విజయం సాధించాయి. దీంతో టాలీవుడ్లో అనుపమకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న తెలుగు చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశేషమేమిటంటే.. గత సంవత్సరం అఆ, ప్రేమమ్.. ఇలా రెండు సినిమాలతో సందడి చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూడా సేమ్ టు సేమ్ రెండు సినిమాలతోనే పలకరించడం. ఈ సంవత్సరం ఇప్పటికే శతమానం భవతితో హిట్ కొట్టిన అనుపమ.. ఈ ఏడాది చివరలో ఉన్నది ఒక్కటే జిందగీతోనూ మరో హిట్‌ని కొడుతుందేమో చూడాలి. అన్నట్టు.. అనుపమకి మలయాళం, తమిళంలో కూడా ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments