అనుపమ.. తన పేరుతోనే
Send us your feedback to audioarticles@vaarta.com
'అఆ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత 'ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యింది. గురువారం 'కృష్ణార్జున యుద్ధం'తో పలకరించబోతోంది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సుబ్బులక్ష్మిగా సందడి చేయనుంది అను. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది అను.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రామారావు నిర్మాత. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'తేజ్‌ది కూడా ఓ మంచి ప్రేమ కథ' అనే పేరు ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాలో అనుపమ తన పేరుతోనే అంటే.. అను అనే పాత్రలో కనిపించనుందని సమాచారం. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు అనుపమ ఏ చిత్రంలోనూ తన పేరుతో నటించిన సందర్భాలు లేవు. తొలిసారిగా తన పేరుతో నటిస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com