న్యాయం కోరుతున్న అనుపమా పరమేశ్వరన్
Send us your feedback to audioarticles@vaarta.com
అనుపమా పరమేశ్వరన్ బుధవారం ఉదయమే ఏడున్నరకు '18 పేజెస్' సినిమా షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరూ లేరు. దాంతో ఆమెకు విసుగు వచ్చింది. 'నిజంగా మనమంతా చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. సమయానికి సెట్ కి చేరుకోవాలి. కాని ఇక్కడ ఎవరు లేరు' అని అనుపమా పరమేశ్వరన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి, సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్ ను ట్యాగ్ చేశారు. 'నాకు న్యాయం కావాలి' అని అనుపమ డిమాండ్ చేశారు. అదీ సంగతి!
నిఖిల్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా '18 పేజెస్'. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి డైరెక్షన్ చేస్తున్నాడు. 'రాక్షసుడు'తో హిట్ కొట్టిన అనుపమ, ఆ తర్వాత అనుపమ యాక్ట్ చేస్తున్న తెలుగు సినిమా ఇది. ప్రజెంట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments