ఫొటోగ్రాఫర్ గా అవతారమెత్తిన అనుపమ
Send us your feedback to audioarticles@vaarta.com
అఆ` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. 'అఆ', 'ప్రేమమ్', 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ` .. ఇలా ప్రతీ చిత్రంలోనూ నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాని, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నకృష్ణార్జున యుద్ధం` సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ఆమె ఓ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనుందని సమాచారం.
అంతేగాకుండా.. ఆ పాత్రలో తన చిలిపి చేష్టలు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అనుపమతో పాటు రుక్సర్ మీర్ కూడా మరో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కానుంది కాగా, ఈ సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, ఎ.కరుణాకరన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అనుపమ కథానాయికగా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com