అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సెలబ్రేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్.. సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ జరుగుతుంది. ఏప్రిల్ 20 వరకు ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు ఫిబ్రవరి 18. కె.ఎస్.రామారావు తనయుడు, ఈ సినిమా సహ నిర్మాత కె.ఎ.వల్లభ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 18నే కావడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సిలో అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ కేక్ కట్ చేశారు. యూనిట్ సభ్యులు అనుపమకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ సందర్భంగా...
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ - "నేను ఇంత గ్రాండ్‌గా నా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. నిర్మాత కె.ఎస్.రామారావు, సాయిధరమ్ సహా యూనిట్‌కు థాంక్స్" అన్నారు.
నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - "అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది. ఇదే రోజున మా అబ్బాయి వల్లభ పుట్టినరోజు కూడా. అనుపమ మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తను ఇలాంటి పుట్టినరోజులను ఎన్నింటినో సెలబ్రట్ చేసుకోవాలని మా యూనిట్ కోరుకుంటోంది" అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్, కె.ఎ.వల్లభ, దర్శకుడు కరుణాకరన్,సినిమాటోగ్రాఫర్ అండ్రూస్, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments