‘రంగస్థలం’ మిస్ చేసుకుని బాధపడుతున్న టిక్ టాక్ క్వీన్!!
- IndiaGlitz, [Thursday,July 25 2019]
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘రాక్షసుడు’. వరుస ప్లాప్‌లతో తికమక పడుతున్న శ్రీనివాస్ ‘రాక్షసుడు’తో అయిన హిట్ కొట్టి తీరాల్సిందేనని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందుకుగాను తమిళంతో విజయవంతమైన ‘రాక్షసన్’ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’గా తెస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్స్ ఫర్లేదనిపించాయి. స్కూల్‌కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలుతీసే ‘సైకో కిల్లర్’ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ ‘రాక్షసుడు’ ఆగస్టు 2న థియేటర్లలోకి వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ పరమేశ్వర్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా, తన రియల్ లైఫ్, క్రికెటర్‌తో సంబంధాలపై పరమశ్వరన్ మాట్లాడారు.
సినిమా స్టోరీ ఏంటి!!
తమిళ్ ‘రాక్షసన్’ సినిమాకి తెలుగు రీమేకే ‘రాక్షసుడు’. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు హైలెట్‌గా ఉంటాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నేను టీచర్ పాత్రలో కనిపిస్తాను. నేనింత వరకూ టీచర్ క్యారెక్టర్ చేయలేదు. టీచర్‌గా చెయ్యటానికి.. టీచర్లా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమాలో నన్ను చూసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ కూడా ఉంది. అమలాపాల్ చేసిన పాత్రే నేను తెలుగులో చేశాను.. చాలా హ్యాపీగా ఉంది. ఆమె అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంతేకాదు తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ డబ్బింగ్ చెప్పే సమయంలో నిజానికి నా వాయిస్ అసలు బాగలేదు. డైరెక్టర్ గారికి చెప్పాను. ప్రజెంట్ వాయిస్ బాగాలేదు వేరే ఎవరి చేతైనా చెప్పించండి అంటే .. లేదూ నేనే చెప్పాలి అని రమేష్ వర్మగారు పట్టుబడితే అప్పుడు నేను చెప్పాను.
భవిష్యత్తులో డైరెక్టర్‌గా..!!
ఇప్పటికే నేను ఓ మలయాళ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. నిజంగా అసిస్టెంట్ గానే పనిచేసేదాన్ని. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అయినా డైరెక్షన్ అంటే ఫ్యాషన్. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. కొన్ని ఐడియాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా రెండు కథలు ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ప్రెజెంట్ అయితే రాక్షసుడు సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఉన్నాను.
రంగస్థలం మిస్సయ్యా.. టిక్ టాక్ క్వీన్!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాను మిస్సయ్యాను. ఈ సినిమాలో ఎందుకు చేయలేదా..? అని చాలా బాధగా ఉంది. అయితే సినిమా చూశాక నేను చేయడం కంటే సమంత బాగా చేశారు అనిపించింది. డేట్లు కుదరక సినిమాను ఒప్పుకోలేకపోయాను కానీ, మరో కారణమేమీ లేదు.
నేను చాలా టిక్‌టాక్ వీడియోలు చేశాను. అందరూ టిక్‌టాక్ క్వీన్ అని పిలుస్తున్నారు. ఏదో సరదాగా అనిపించింది చేశానంతే అని అనుపమా చెప్పుకొచ్చింది.