బరువు తగ్గుతున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
2016లో అఆ.. ప్రేమమ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తర్వాత 2017లో `శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ` చిత్రాల్లో నటించింది. 2018లో `కృష్ణార్జునయుద్దం, తేజ్ ఐ లవ్ యు` చిత్రాల్లో నటించింది. ఇంకా రామ్‌తో నటించిన `హలో గురు ప్రేమ కోసమే` సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కన్నడలో నటసార్వభౌమ సినిమాలో నటిస్తుంది. తెలుగు సినిమాలంటే ఎక్కువ ఆసక్తినిచూపి అనుపమ.. హలో గురు ప్రేమ కోసమే సినిమాపై భారీ అశలనే పెట్టుకుంది.
ప్రొఫెషనల్‌గా కెరీర్‌ను ఇలా కొనసాగిస్తున్న అనుపమ ఫిజికల్‌గా బరువు తగ్గే పనిలో పడింది. ఎందుకంటే ``బేసిక్‌గా ఫుడ్ లవర్ని నచ్చింది కనపడితే ఎక్కువగా తినేస్తా.. అందుకే ఈ మధ్య బరువు పెరిగాను. ఆ బరువును తగ్గించుకోని పనిలో ఉన్నాను`` అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com