రామ్ హీరోయిన్స్ తో మెగా హీరో రొమాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ సినిమాలో యువ కథానాయకుడు రామ్‌కి జోడీగా నటిస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు.. వేర్వేరు సినిమాల కోసం మెగా ఫ్యామిలీ కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. 'అఆ', 'ప్రేమమ్', 'శతమానం భవతి' చిత్రాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్. 'భలేభలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా'తో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న లావణ్య త్రిపాఠి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ'లో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
కట్ చేస్తే.. వారం గ్యాప్‌లో లాంఛనంగా ప్రారంభమైన సాయిధరమ్ కొత్త చిత్రాలలో ఈ ఇద్దరే హీరోయిన్స్. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సాయి నటిస్తున్న చిత్రంలో లావణ్య హీరోయిన్‌గా నటించనుంటే.. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి నటించనున్న తాజా చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. రామ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కి కూడా ఈ తాజా చిత్రాల ఫలితాలు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ లక్కీ గర్ల్స్ వారికి ఏ మాత్రం కలిసొస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com