నాని తమిళ రీమేక్‌లో అనుపమ
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తమిళంలో ఓ సినిమా చేయబోతుంది. వివరాల్లోకెళ్తే.. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధనా పాత్రధారులుగా తెలుగులో విడుదలైన చిత్రం `నిన్నుకోరి`. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుంది. ఈ విషయాన్ని తమిళంలో డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు కన్నన్ తెలియజేశారు.
ఈ సినిమాలో నివేదా థామస్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాలో అనుపమ పాత్రను డ్యాన్సర్‌గా చూపిస్తామని కూడా ఆయన తెలిపారు. నాని పాత్రలో అధర్వ నటిస్తున్నాడు. మరి ఆది పినిశెట్టి పాత్రలో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments