సుబ్బలక్ష్మీగా అనుపమ
Send us your feedback to audioarticles@vaarta.com
అనుపమ పరమేశ్వరన్... చేసినవి నాలుగే నాలుగు తెలుగు సినిమాలు అయినా.. తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వర్థమాన తార పేరిది. అఆ`తో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలబారు భామ.. అందులో నాగవల్లి అనే పల్లెటూరి అమ్మాయిగా తను అనుకున్నది చేసేసే పాత్రలో నటించింది. ఇక రెండో చిత్రం ప్రేమమ్`లో సుమగా.. తను ప్రేమించే అబ్బాయి కోసం తనని ప్రేమించే అబ్బాయి ప్రేమను వాడుకుని తను అనుకున్నది నెరవేర్చుకునే పాత్ర చేసింది అనుపమ.
ఇక మూడో మూవీ శతమానంభవతి` కోసం తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తల్లిదండ్రులను కూడా కాదని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరుండి అనుకున్నది సాధించే నిత్య పాత్రలో కనిపించింది. ఇక ఇటీవల విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ` సినిమాలో మహా పాత్రతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన పాత్రలలో అమాయకంగా కనిపిస్తూనే తన పాత్రలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రస్తుతం నాని సరసన కృష్ణార్జున యుద్ధం` సినిమాలో కూడా అభినయానికి అవకాశమున్న పాత్రలోనే నటించిందని ఇండస్ట్రీ టాక్. ఇందులో సుబ్బలక్ష్మి అనే మోడ్రన్ అమ్మాయిగా కనిపించనుంది అనుపమ. మరి ఈ పాత్ర తనకు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com