అనుపమ.. అసిస్టెంట్ డైరక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు కొత్త జాబ్ చేస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరక్టర్‌గా. మరి నాయికగా కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా? ఏమాత్రం కాదు. ఆమె నటిగా చాలా హాయిగా ఉన్నారు. అంతెందుకు తెలుగులో `రాక్షసుడు` విడుదలకు సిద్ధమవుతోంది. మరో వైపు మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్‌లో ఆమె హీరోయిన్. ఇప్పుడు ఆమె అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నది కూడా ఆ సినిమా కోసమే. కొత్త దర్శకుడు షాంశు జైబా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
జాకోబ్ గ్రెగరీ హీరోగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు మునుపు దుల్కర్‌తో కలిసి `ఏబీసీడీ`, `పరవ`, `100 డేస్ లవ్`, `జోమోట్ సువిశేషగల్` తదితర చిత్రాల్లో నటించారు. `జోమోట్ సువిశేసగల్`లో దుల్కర్ సరసన అనుపమ నటించింది. ఆ సినిమా తర్వాత ఆమె దుల్కర్‌తో అసోసియేట్ కావడం ఇదే. కానీ ఈ సినిమాలో వీరిద్దరూ జోడీ కట్టడం లేదు. నిర్మాతగా దుల్కర్ వ్యవహరిస్తున్నారు. నటిగా, అసిస్టెంట్ డైరక్టర్‌గా అనుపమ పనిచేస్తున్నారు. తన రోల్ అయిపోయిన వెంటనే కేర్‌వ్యాన్ వైపు వెళ్తున్న హీరోయిన్లున్న ఈ కాలంలో అనుపమ డెడికేషన్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com