అనుపమ్ ఖేర్ రాజీనామా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్.టి.ఐ.ఐ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ``ఎఫ్.టి.ఐ.ఐ చైర్మన్గా బాధ్యతలను నిర్వర్తించడం చాలా గొప్ప విషయం.
చాలా విషయాలను నేర్చుకున్నాను. నేను అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. అందువల్ల తగినంత సమయాన్ని ఇన్స్టిట్యూట్కి కేటాయించలేకపోతున్నాను. అందుకే పదవి నుండి తప్పుకుంటున్నాను`` అంటూ పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. గజేంద్ర చౌహాన్ నుండి బాధ్యతలను 2017 అక్టోబర్న స్వీకరించారు. ఏడాది తర్వాత అనుపమ్ ఖేర్ ఆ బాధ్యతలను నుండి తప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments