అనుప‌మ్ ఖేర్ రాజీనామా?

  • IndiaGlitz, [Wednesday,October 31 2018]

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫిలిమ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్.టి.ఐ.ఐ) చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ''ఎఫ్‌.టి.ఐ.ఐ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌డం చాలా గొప్ప విష‌యం.

చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. నేను అంత‌ర్జాతీయ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాను. అందువ‌ల్ల త‌గినంత స‌మయాన్ని ఇన్‌స్టిట్యూట్‌కి కేటాయించ‌లేక‌పోతున్నాను. అందుకే ప‌దవి నుండి త‌ప్పుకుంటున్నాను'' అంటూ పేర్కొన్నారు అనుప‌మ్ ఖేర్‌. గ‌జేంద్ర చౌహాన్ నుండి బాధ్య‌త‌లను 2017 అక్టోబ‌ర్‌న స్వీక‌రించారు. ఏడాది త‌ర్వాత అనుప‌మ్ ఖేర్ ఆ బాధ్య‌త‌ల‌ను నుండి త‌ప్పుకున్నారు.